సింహాద్రిపురంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్లో మంగళవారం మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కాలువలో పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కల తొలగింపును రూ. 18 లక్షలతో అధికారులు టెండర్లు పిలిచి పనులను చేయిస్తున్నారు. ఈసందర్భంగా పీబీసీ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. మంగళవారం పనులను ప్రారంభించి అధికారులు చర్యలు తీసుకోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.