తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్ సీ డాక్టర్ రేష్మ గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పీహెచ్ సీ లో సాధారణ కాన్పులు చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఆస్పత్రిలో అన్ని వసతులతో పాటు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ ను ఇస్తామన్నారు.