ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు అమరావతి మీదుగా రైల్వేలైన్ మంజూరు హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజధాని అమరావతిని వివిధ నగరాలతో, పోర్టులతో అనుసంధానం చేసేందుకు రైల్వేలైన్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. గత 2017లో అమరావతి రైల్వేలైన్ మంజూరు కాగా, ఆచరణలోకి రాలేదన్నారు.