రైల్వే కోడూరు మండలం గుండాల పల్లికి చెందిన సింగిరి జయప్రకాష్ ఆకస్మికంగా మృతి చెందారు. గురువారం వారి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.