పుల్లంపేట పట్టణం బైపాస్ లో గల కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీధర్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.