గంజాయి మొక్కల పెంపకం, నిల్వ, అమ్మకం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వేకోడూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం చిట్వేలి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ.. చిట్వేలి కోడూరు ప్రధాన రహదారిలో గొల్లపల్లి కి చెందిన గంధం ప్రసాద్ (63)గంజాయి అమ్మడానికి నిలబడి ఉండగా వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేశామని ఆయన తెలిపారు.