రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రైల్వే కోడూరు, చిట్వేలి, రాజంపేటలో ఎస్సైగా పనిచేసిన అనుభవం అతనిది. అన్ని మండలాలలో పరిస్థితులపై అతనికి మంచి అవగాహన ఉండడంతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. చిట్వేలి ప్రధాన రహదారిలో మొక్కలను నాటించిన ఘనత అతనిది. శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తానని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.