లక్కిరెడ్డిపల్లి మండలంలోని శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి ఆలయ జాతర వేలంపాట తాత్కాలికంగా రద్దయినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆలయ ఈవో మాట్లాడుతూ.. వేలంపాట 25వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.