తొందరపాటు నిర్ణయాల వలన దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సగటున లక్షా డెబ్భై వేల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ అన్నారు. మంగళవారం " ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం" సందర్భంగా సంబేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తిట్టారనో, గురువులు మందలించారనో, ర్యాంకులు రాలేదనే చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించ రాదని ఆయన అన్నారు.