చెన్నూర్ పట్టణంలో నిషేధిత గుట్కాను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై సుబ్బారావు సిబ్బందితో కలిసి స్థానిక కుమ్మరి బొగడకు చెందిన మూట శ్రీనివాస్, కొండమీది మధుకర్ నివాసంలో తనిఖీలు చేయగా గుట్కా సంచులు గుర్తించారు. ఈ సందర్భంగా రూ. 60 వేలు విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు.