అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

68చూసినవారు
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
గాలివీడు మండలంలో ఎస్సై రామకృష్ణ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. శుక్రవారం పాపాగ్ని నది నుంచి గాలివీడుకు అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో దానమ్మ వారి పల్లె వద్ద ట్రాక్టర్లు పట్టుకొని డ్రైవర్ గంగాధర్, ట్రాక్టర్ యజమాని అంజి పై కేసు నమోదు చేశారు. ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్