రాయచోటి: ప్రజల నుండి వినతులు స్వీకరించిన మంత్రి మండిపల్లి
విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలనుండి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.