రాయచోటి: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

62చూసినవారు
రాయచోటి: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు
మైనర్లు వాహనాలు నడిపితే వారి పైన, వాహనం యజమాని పైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రాయచోటి ఎస్సై నరసింహ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. వాహనదారుల వద్ద రికార్డ్స్ పరిశీలించి లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్