ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం చిన్నమండ్యం మండలం బోరెడ్డిగారి పల్లె లోని తమ నివాసం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏవరూ సమస్యలతో బాధ పడకూడదని ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.