రాయచోటి: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం చిన్నమండెం మండలం భూరెడ్డిగారి పల్లెలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా భూ సమస్యలతో తమ వద్దకు వస్తున్నారని రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.