భూములు, రెవెన్యూ సమస్యలకు 45 రోజుల లోపల పరిష్కారం చూపిస్తామని తంబళ్లపల్లి తహశీల్దార్ హరి కుమార్ అన్నారు. శుక్రవారం తంబళ్లపల్లె మండలం కొట్లపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజలు, రైతుల నుండి పలు సమస్యలపై అధికారులు అర్జీలు స్వీకరించి పీజీఆర్ఎస్ వెబ్ సైట్ నందు నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.