తంబళ్లపల్లెలో ఎటు చూసినా లీకేజీలే..!

54చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలో ఎటు చూసినా తాగునీటి పైప్లాన్లు దెబ్బతిని మంచినీరు వృథాగా పోతోంది. పలు చోట్ల మంచినీరు కలుషితమవుతోంది. అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని బుధవారం ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని మసీదు వద్ద, మల్లయ్య కొండకు వెళ్లే రోడ్డులో, వెంకటేశ్వర వీధి, సాలె వీధి, దేవలం వీధుల్లో నీరు లీకవుతోంది.

సంబంధిత పోస్ట్