ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శుక్రవారం దారుణం జరిగింది. వెంకటేశ్వర్ రెడ్డికి, భార్య పుష్పవతితో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దంపతుల గొడవను పరిష్కరించేందుకు పెద్దలు హేమాద్రి లాడ్జిలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో భార్యను వెంకటేశ్వర్ రెడ్డి పక్కకు పిలిచి వేటకొడవలితో దారుణంగా నరికాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.