ఛాతీపై బంతి తగిలి 16 ఏళ్ల గోల్ కీపర్ మృతి (వీడియో)

85చూసినవారు
బ్రెజిల్ లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 16 ఏళ్ల గోల్ కీపర్ ఎడ్సన్ లోప్స్ గామా ఛాతీపై బంతి తగిలి మరణించాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా బంతిని ఆపే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడు మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్