AP: పథకాలు ఎగ్గొట్టడంలోనూ పన్నులు వేయడంలోనూ సీఎం చంద్రబాబు ముందుంటారని వైసీపీ ఆరోపించింది. తాజాగా ఇంకో మార్గంలో డబ్బు పిండుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలిపింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమాంతం పెంచేశారని విమర్శించింది. దీంతో రాష్ట్ర ప్రజలకు భారం తప్పదని వెల్లడించింది. అయితే వైసీపీ ట్వీట్‌కు టీడీపీ శ్రేణులు సైతం గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.