తమిళనాడులో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చైన్ స్నాచర్ జాఫర్ మరణించాడు. చెన్నై తారామణి రైల్వే స్టేషన్ సమీపంలో విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానని పోలీసులను తీసుకెళ్లిన చైన్ స్నాచర్ జాఫర్, మార్గమధ్యలో తప్పించుకునేందుకు పోలీసులపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాఫర్ మృతి చెందాడు.