గర్భ నిరోధక మాత్రల వల్ల బరువు పెరుగుతాం. మొటిమలు, అవాంఛిత రోమాలొస్తాయి. మొదటి తరం కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల అరుదుగా అధిక బరువు సమస్య ఎదురైందంటున్నారు నిపుణులు. వాటివల్ల శరీరంలో నీటి శాతం పెరిగి తద్వారా అధిక బరువు సమస్యకు దారి తీసిందంటున్నారు. అయితే కొత్త ఫార్ములా మందుల వల్ల బరువు, మొటిమలు, అవాంఛిత రోమాల సమస్యలు లేవని చెబుతున్నారు. పైగా ఇవి పీసీఓఎస్ ఉన్న వారిలో బరువు తగ్గేందుకు దోహదపడడంతో పాటు మొటిమలు రాకుండా చేస్తున్నాయట!