సంతాన సమస్యలకు కాంట్రాసెప్టివ్ పిల్స్‌కి అసలు సంబంధమే లేదని, అలా అనడానికి ఎలాంటి ఆధారమూ లేదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ కోర్సు పూర్తయ్యాక పిల్స్‌ని ఆపేస్తే ప్రెగ్నెన్సీ రావడానికే ఎక్కువ శాతం అవకాశాలున్నాయంటున్నారు. అందుకే గర్భం వద్దనుకుంటే ఒక్క రోజు కూడా మానకుండా మాత్ర వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ కోసం మాత్రలు వేసుకోవడం ఆపేసినా త్వరగా గర్భం ధరించకపోవచ్చు. అందుకు వయసు పైబడడం, సహజసిద్ధంగా గర్భం ధరించలేకపోవడం కారణాలు కావచ్చట!