పవన్‌కు మద్దతుగా ముద్రగడ కూతురి మరో వీడియో

52చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మరో వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తమ అదృష్టం. మొన్న నేను విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. పవన్ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్