కేరళలోని శబరిమల ఆలయంలో టీడీబీ ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. విషు పర్వదినం సందర్భంగా కేరళ మంత్రి వీఎన్ వాసవన్ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఏపీకి చెందిన భక్తుడికి తొలి లాకెట్‌ను అందజేశారు. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ ధర రూ.19,300, 4 గ్రాముల లాకెట్ ధర రూ.38,600, 8 గ్రాముల లాకెట్ ధర రూ.77,200గా నిర్ణయించారు.