నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP)ను అమలు చేస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఈ పథకం కింద రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ రుణంలో గరిష్ఠంగా 35% వరకు రాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు పైబడి, 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు kviconline.gov.in ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.