ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. అనంతరం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. చండీగఢ్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చండీగఢ్‌లో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.