AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సంవత్సరంలో ప్రారంభించాల్సిన పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం.