ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుకలివే.. వైసీపీ సెటైర్లు

59చూసినవారు
ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుకలివే.. వైసీపీ సెటైర్లు
AP: ఆరు గ్యారంటీలను గాలికొదిలేసిన మోసం స్టార్ CBN కొత్త సంవత్సర కానుకగా వెన్నుపోటు అస్త్రాలను ప్రజలపైకి సంధిస్తున్నారని వైసీపీ విమర్శించింది. ‘6 నెలల్లో రూ.1.12L కోట్ల అప్పు. రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం. రోడ్ ట్యాక్స్, బీచ్ ఎంట్రీ ఫీజులు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ధాన్యం గిట్టుబాటు ధరకు మంగళం, రైతుల బీమా ప్రీమియం భారం. రూ.కోట్లలో ఆరోగ్య శ్రీ, రీయింబర్స్మెంట్ బకాయిలు. ఇవే ప్రజలకు బాబు సూపర్ సిక్స్ కానుకలు' అని సెటైర్లు వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్