AP: ఎస్సీ వర్గీకరణ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. జిల్లాల వారిగా జనగణన చేసిన తరువాత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుదామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే బుడగజంగం వారిని ఎస్సీ ఏ గ్రూపులో కలపాలని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసన సభ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయం తీసుకుంది.