ఛత్తీస్‌గఢ్‌లో గురువారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌షా స్పందిస్తూ.. మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ’వచ్చే మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని, నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ దిశలో మన సైనికులు మరో పెద్ద విజయాన్ని సాధించారు' అని తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై కఠినమైన వైఖరితో ముందుకు సాగుతోంది.