మార్చి నెలలోనే పీ4 విధానం: సీఎం చంద్రబాబు

58చూసినవారు
మార్చి నెలలోనే పీ4 విధానం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు పెంచేందుకు గతంలో పీపీపీ విధానం తీసుకువచ్చానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తగా మార్చి నెలలో పీ4 విధానాన్ని తీసుకురానున్నామని సీఎం స్పష్టం చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. "ఆర్థికంగా బాగున్న వారు సమాజానికి ఎంతోకొంత తోడ్పాటునందించాలి. పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తాం" అని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్