AP: టీడీఆర్ బాండ్లపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు, యూడీఏ అధికారులుతో శుక్రవారం మంత్రి నారాయణ సమీక్షించారు. వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారులకు ఆన్‌లైన్‌లో బాండ్లు అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన వాటిని రెండు రోజుల్లోగా పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.