AP: నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 12న 866 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష వివరాలు ఏపీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 2023లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.