రేపే ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌.. ఎల్లుండి నుంచి దరఖాస్తుల స్వీకరణ!

64చూసినవారు
రేపే ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌.. ఎల్లుండి నుంచి దరఖాస్తుల స్వీకరణ!
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) కొత్త నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నోటిఫికేషన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్