దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20డబ్ల్యూసీ ఫైనల్లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం సూర్య క్యాచ్‌కు ఫిదా అయిపోయారు. ‘మా నాన్న నాకు కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గురించి చెప్పారు. నేను నా పిల్లలకు సూర్య పట్టిన క్యాచ్ గురించి చెబుతా’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దానికి సూర్య ‘చాలా పెద్ద మాట అన్నారు’ అని రెస్పాండ్ అయ్యారు.