భారత లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు భూపిందర్ సింగ్ రావత్(85) కన్నుమూశారు. అనారోగ్యంతో శనివారం మరణించినట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) ధృవీకరించింది. 1960 - 1970లలో డిఫెన్స్‌ను భయభ్రాంతులకు గురిచేసిన వేగవంతమైన వింగర్ రావత్ పేరు గాంచారు. 1969లో మలేషియాలో జరిగిన మెర్డెకా టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.