శివలింగాన్ని చుట్టుకున్న భారీ నాగుపాము(వీడియో)

68చూసినవారు
AP: నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లిలోని శివాలయంలో శనివారం అద్భుతం జరిగింది. విశ్వనాథ స్వామి ఆలయంలోని శివలింగాన్ని ఓ భారీ నాగుపాము చుట్టుకుంది. గర్భగుడి నుంచి శబ్దం రావడంతో అక్కడే నిద్ర పోతున్న పూజారులు లేచి చూడగా.. ఈ దృశ్యం కంటపడింది. అది చూసిన వారు వారు తన్మయత్వానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గుడి వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్