పిల్లికి ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అవార్డు

62చూసినవారు
పిల్లికి ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అవార్డు
పిల్లికి డాక్టరేట్ రావడం ఏంటని అనుకుంటున్నారా..? అవును.. మీరు విన్నది నిజమే. అమెరికాలోని వేర్మొంట్ స్టేట్ యూనివర్సిటీ.. మాక్స్ డౌ అనే పిల్లికి గౌరవ ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. దాని వెనుక ఓ కారణముంది. యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద తన యజమానితో కలిసి ఈ పిల్లి చాలా కాలంగా నివసిస్తోంది. అక్కడి వారితో పిల్లి చాలా స్నేహపూర్వకంగా, మర్యాదగా ప్రవర్తిస్తుందట. దీంతో ఆ పిల్లికి ఈ అవార్డును అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్