వైసీపీ పేద అభ్యర్థికి రూ.161 కోట్ల ఆస్తులు.. అంతంత మాత్రమే లేవుగా..!

1083చూసినవారు
వైసీపీ పేద అభ్యర్థికి రూ.161 కోట్ల ఆస్తులు.. అంతంత మాత్రమే లేవుగా..!
మరోసారి వార్తల్లోకి వచ్చారు బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె.. తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తిపాస్తుల వివరాల్ని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. బుట్టా రేణుక.. ఆమె భర్త శివ నీలకంఠ పేరుతో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.161.21 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉంటే.. చరాస్తులు రూ.142.46 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.7.82 కోట్లుగా చూపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్