AP: పేదరికం, మూఢనమ్మకం ఓ బాలిక ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో చోటుచేసుకుంది. బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ (8) రెండు నెలలుగా బ్రెయిన్ ట్యూమర్ బాధపడుతోంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. పేదరికం కారణంగా ఆదురుపల్లి చర్చిలో ప్రార్థనలు చేశారు. బాలిక హుషారుగా కనిపించడంతో ఓ రోజు అన్నదానం కూడా చేశారు. 40 రోజుల తర్వాత(సోమవారం రాత్రి) భవ్యశ్రీ చనిపోయింది.