TG: మంచిర్యాల జిల్లా కాసిపేటలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో మంగళవారం పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దంపతులు, కుమార్తె మృతి చెందారు. వారి కుమారుడు చికిత్స పొందుతున్నారు. దీంతో కాసిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.