ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయమయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాంలో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీంతో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి నుంచి రెట్టింపు జరిమానా వసూలుకు ఆదేశించారు. కాగా.. పేర్ని నానికి చెందిన 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాంను గతంలో పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది.