AP: ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి ఆరా తీశారు. ఆర్టీసీ అధికారులు తీసుకున్న చర్యలపై మంత్రి వివరణ కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు. కాగా, కర్ణాటకలో ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ పై స్థానిక డ్రైవర్ విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.