గుంటూరు కార్పొరేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలా బాధ్యతలు స్వీకరించారు. కొత్త మేయర్‌ను ఎన్నుకొనే వరకు డిప్యూటీ మేయర్ సజీలా బాధ్యతలు నిర్వహించనున్నారు. మేయర్ మనోహర్ నాయుడు ఇటీవల రాజీనామా చేశారు. మరో ఏడాది కాలం ఉండగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో కొత్త మేయర్‌ను ఎన్నుకునేవరకు డిప్యూటీ మేయర్ సజీలాకు ఆ బాధ్యతలను అప్పగించారు.