నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువును భర్త గొంతు నులిమి కిరాతకంగా చంపాడు. డీఎస్పీ వివరాల ప్రకారం.. వినోద్ నాయక్ తన మేనమామ కూతురు అయిన శారు రాథోడ్‌కు జనవరిలో పెళ్లైంది. అయితే వినోద్‌కు భార్య శారు అంటే ఇష్టం లేదు. ఈ క్రమంలో తరుచూ గొడవ పడుతూ.. వేధించేవాడు. అయితే ఎలా అయినా వదిలించుకోవాలి అనే నెపంతో గొంతు నులిమి చంపి.. తాడుకు వేళాడ తీశాడని పోలీసులు వెల్లడించారు.