AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇంటిపై రాళ్లదాడి జరిగింది. అక్రమంగా ఇల్లు నిర్మించారని గతంలో మున్సిపల్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దానిని చూసేందుకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఘర్షణ జరిగి ఫయాజ్ ఇంటిపై రాళ్ల దాడిచేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు.