అవనిగడ్డ వైసీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన

15847చూసినవారు
అవనిగడ్డ వైసీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన
వైసీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు సింహాద్రి రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సోమ‌వారం సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఆయన ఈ విష‌యం వెల్ల‌డించారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా త‌న కుమారుడు ప‌నిచేస్తాడ‌ని చంద్రశేఖర్‌రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్