జగన్ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టబోతున్న బాబు?

17757చూసినవారు
జగన్ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టబోతున్న బాబు?
ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికిని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది. ఆ పార్టీని ఈ అయిదేళ్లలో వీలైనంతవరకూ దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు అని బాబు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి శాసనమండలిలో బలం ఉంది. ఏకంగా 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసనమండలిలో కీలకం. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసనమండలిని రద్దు చేయించేందుకు బాబు చూస్తున్నారు అని అంటున్నారు.