ఉద్యోగులు చెప్పినట్టుగా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచి మౌలిక సదుపాయాలను విస్మరించిందని ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్న మంత్రి, గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలకు, హెచ్చులకు పోబోమన్నారు.